ట్రంప్​కు బెదిరింపు.. ట్విట్టర్ వేటు

ఇరాన్​ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ పేరుతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై బెదిరింపులకు పాల్పడ్డ ట్విట్టర్​ ఖాతాను ఆ సంస్థ తొలగించింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ శుక్రవారం వెల్లడించింది. ఆ ఖాతాను శాశ్వతంగా రద్దు చేసిన సోషల్​ మీడియా దిగ్గజం, అది నకిలీదని పేర్కొంది. ట్రంప్​పై చేసిన పోస్ట్​ తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

ఆ పోస్ట్​లో ఏముంది?

ఖొమైనీ పేరుతో ఉన్న ట్విట్టర్​ ఖాతా ద్వారా దుండగులు గురువారం రోజు ట్రంప్​పై బెదిరింపులకు పాల్పడ్డారు. గోల్ఫ్​ ఆడుతున్న ట్రంప్​పై యుద్ధ విమానం నీడ పడుతున్నట్లుగా ఓ ఫొటోను పోస్ట్​ చేశారు. ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం అంటూ హెచ్చరించారు. ఈ చిత్రం ఖొమైనీ అధికారిక వెబ్​సైట్లో కూడా ఉండటం గమనార్హం. నెల క్రితం జనరల్​ సులేమానీ మృతిపట్ల ట్రంప్​పై పరోక్షంగా ఖొమైనీ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This