క్యాపిటల్​ రగడ: ట్రంప్​ ఖాతాను లాక్​ చేసిన ట్విట్టర్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ ఖాతాను ట్విట్టర్​ లాక్ చేసింది. 12 గంటల పాటు లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తమ నియమాలకు విరుద్ధంగా ఉన్నట్వీట్లను వెంటనే తొలగించాలని ట్రంప్​ని కోరింది. సంబంధిత ట్వీట్లు తొలగించకపోతే ఖాతాని లాక్​ చేసే ఉంచుతాం అని స్పష్టం చేసింది. దీనిపై అధ్యక్షుడి నుంచి స్పందన లేకపోవడం చూసిన ట్వీట్టర్​.. ట్రంప్‌ చేసిన రెండు ట్వీట్లను తొలగించింది.

ఫేస్​బుక్​ది అదే దారి…

ఆందోళనకారులు సంయమనం పాటించాలంటూ ఫేస్​బుక్​లో ట్రంప్‌ పోస్టు చేసిన వీడియో సందేశాన్ని ఫేస్​బుక్​ యాజమాన్యం తొలగింది. ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళనల దృష్ట్యా వీడియో తొలగించామని ఫేస్‌బుక్‌ వివరణ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This