హెచ్​1బీ వీసా ఆంక్షలు సడలింపు- వారికి అనుమతి

హెచ్​1బీ వీసా నిబంధనల్లో డొనాల్డ్​ ట్రంప్ ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. వీసా నిషేధ ప్రకటనకు ముందు నిర్వర్తించిన ఉద్యోగాల కోసం అమెరికాకు తిరిగి రావాలనుకునే ఉద్యోగులకు ఊరట కల్పించింది. అమెరికా వచ్చేందుకు వీరికి అనుమతిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది.

వీసా హోల్డర్లతో పాటు వారి భాగస్వాములు, పిల్లలు సైతం అమెరికాకు రావొచ్చని యూఎస్ డిపార్ట్​మెంట్ ఆఫ్ స్టేట్స్ అడ్వైజరీ పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం కోసం అత్యవసర సేవలందించే సాంకేతిక నిపుణులు, సీనియర్ మేనేజర్లు, ఇతర హెచ్​1బీ వీసాదార్లకు దేశంలోకి ప్రవేశించేందుకూ అనుమతించింది.

కొవిడ్ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి పనిచేసే పరిశోధకులు, వైద్య సంరక్షణ నిపుణులకు సైతం ఆంక్షలను సడలించింది.

“విదేశాంగ విధాన లక్ష్యాలు నెరవేర్చేలా ఉండే అమెరికా ప్రభుత్వ సంస్థల అభ్యర్థనల ప్రకారం ప్రయాణానికి సహకారం అందించడం జరుగుతుంది. రక్షణ శాఖ లేదా పరిశోధనలు నిర్వహించే అమెరికా ప్రభుత్వ శాఖలు ఆయా వ్యక్తులను గుర్తిస్తాయి.”

-అమెరికా విదేశాంగ శాఖ అడ్వైజరీ

జూన్ 22న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్​1బీ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ సంవత్సరం చివరివరకు ఈ నిషేధం కొనసాగించనున్నట్లు అప్పట్లో ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This