ట్రంప్​కు మాస్కు ధరించాలని చెప్పిన కరోనా..!

కరోనా చికిత్స నిమిత్తం సైనిక ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను సోమవారం డిశ్ఛార్జి చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. వాల్టర్ రీడ్ జాతీయ సైనిక వైద్య కేంద్రంలో చికిత్స పొందుతున్న ఆయన.. తన కోసం వచ్చిన అభిమానులను చూసేందుకు ఆదివారం బయటకు వచ్చారు. అందరికీ అభివాదం చేసుకుంటూ కాన్వాయ్​లో ముందుకు సాగారు. ఎప్పుడూ మాస్కు లేకుండా ప్రచారాలు, భారీ బహిరంగ సభలకు హాజరైన ఆయన కారులో సైతం మాస్కు ధరించి కనిపించారు​.

అంతకుముందు కొవిడ్-19 గురించి తనకు పూర్తిగా అర్థమైందని పేర్కొంటూ ట్విట్టర్​లో వీడియోను పోస్టు చేశారు అమెరికా అధ్యక్షుడు. నిజమైన పాఠశాలలో కరోనా గురించి పూర్తిగా తెలుసుకున్నానని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This