‘ఎన్నికల ఫలితాన్ని ట్రంప్​ అంగీకరిస్తారు… కానీ…’

ఎన్నికల్లో తాను ఓడిపోతే అధికార బదిలీ అంత ప్రశాంతంగా జరగకపోవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరతీశాయి. దీంతో శ్వేతసౌధం ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అన్నీ సజావుగా, పారదర్శకంగా జరిగితే ట్రంప్‌ ఎన్నికల ఫలితాల్ని స్వీకరిస్తారని శ్వేతసౌధం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎన్నికల ఫలితాల్ని అంగీకరించరబోమని డెమొక్రటిక్‌ పార్టీ నాయకులే పదే పదే అంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల్ని ఎలా స్వీకరించబోతున్నారని వారినే ప్రశ్నించాలని విలేకరులకు హితవు పలికారు. ‘ట్రంప్‌ గెలిస్తే ఫలితాల్ని అంగీకరించేది లేదు’ అంటూ పలు సందర్భాల్లో డెమొక్రటిక్‌ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని ఉటంకించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌లపై మొదటి నుంచి తనకు అభ్యంతరాలు ఉన్నాయని ట్రంప్‌ గురువారం మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓడితే అధికార బదిలీ విషయంలో ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. ఫలితాలపై సుప్రీంకోర్టు వరకు వెళ్లవచ్చన్నారు. దీంతో ఆయన మాటలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్‌ ఓటమిని అంగీకరించరని.. శ్వేతసౌధాన్ని వీడేందుకు నిరాకరిస్తారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This