‘టాలీవుడ్​లో నటుడిగా ఉన్నందుకు గర్వంగా ఉంది’

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని యువ కథానాయకుడు సాయి ధరమ్​ తేజ్ అన్నారు. కష్టకాలంలో పరిశ్రమ మొత్తం మద్దతుగా నిలిచి తన సినిమా విడుదలను ప్రోత్సహించిందని గుర్తుచేసుకున్న తేజ్​.. ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినిమా విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించిన చిత్ర యూనిట్.. సినిమా గెలవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సినిమాల పునఃప్రారంభానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ఆదర్శంగా నిలిచిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This