టిడ్కో గృహ సముదాయాల పనుల్లో కదలిక..!

రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టి వివిధ దశల్లో ఆగిన పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో) గృహ సముదాయాల నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం వచ్చింది. ఏడాదిన్నరగా రివర్స్‌ టెండర్లు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పునఃపరిశీలన తదితర కారణాలతో నాన్చిన ప్రభుత్వం తాజాగా నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే పూర్తయి సకల సౌకర్యాలు కలిగిన 79 వేల ఫ్లాట్లను లబ్ధిదారులకు కేటాయించకుండా పక్కనపెట్టి.. పునాది, ఆపై స్థాయిల్లో ఉన్న 1.18 లక్షల ఫ్లాట్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. వీటిని 18 నెలల్లో పూర్తి చేసేలా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. తొలుత ఇళ్ల పట్టాల పంపిణీ అనంతరం వీటిని ప్రారంభించాలని భావించినా తాజాగా ఆ ప్రక్రియతో సంబంధం లేకుండానే నిర్మాణ పనులు మొదలు పెట్టాలని నిర్ణయించింది.

ఫ్లాట్ల కేటాయింపు తర్వాత లబ్ధిదారుల వాటా స్వీకరణ
నిర్మాణ పనులు ప్రారంభించనున్న 1.18 లక్షల ఫ్లాట్లలో 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవి 44,365 కాగా మిగతావి 430 చ.అడుగుల విస్తీర్ణం ఉన్నవి. వీటిని లబ్ధిదారులకు కేటాయించనున్నారు. నిబంధనల మేరకు 365 చ.అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లకు ఎంపికైన లబ్ధిదారులు వారి వాటా కింద రూ.50 వేలు, 430 చ.అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లు కేటాయించిన లబ్ధిదారులు రూ.లక్ష చెల్లించాలి. ఫ్లాట్ల కేటాయింపు అనంతరం లబ్ధిదారుల వాటాను టిడ్కో అధికారులు సేకరిస్తారు. దీంతోపాటు లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాన్ని మంజూరు చేయించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This