ఆనందాల లోగిలి.. కన్నీటి మజిలీ…

నల్గొండ జిల్లా నకిరేకల్​ మండలం పెరికెకొండారం గ్రామానికి చెందిన సీహెచ్​ లింగారెడ్డి వినోద దంపతుల కుమార్తె విజయారెడ్డి. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. ఆమె సోదరి సంధ్యారాణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. విజయారెడ్డి తొలి ప్రయత్నంలోనే డీఎస్సీ ద్వారా ఎస్జీటీగా ఉద్యోగం సాధించి నల్గొండ జిల్లా సంస్థాన్​ నారాయణపురంలో కొంతకాలం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.

ఉత్తమ తహసీల్దార్​గా ప్రశంస…

అనంతరం మొదటి ప్రయత్నంలోనే 2009లో గ్రూపు-2 పరీక్షలు రాసి డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికయ్యారు. జిల్లాల విభజన తర్వాత రంగారెడ్డి జిల్లాకు వచ్చి అబ్దుల్లాపూర్​మెట్​ మండల తొలి తహసీల్దార్​గా 2016లో బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. 2017లో జిల్లాస్థాయి ఉత్తమ తహసీల్దార్​గా ఎంపికై ప్రశంసాపత్రం అందుకున్నారు. విజయారెడ్డికి మునుగోడు ప్రాంతానికి చెందిన పుట్టా సుభాష్​రెడ్డితో వివాహమైంది. భర్త హయత్​నగర్​ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబంతో చైత్యపురి సమీపంలోని గ్రీన్​హిల్స్​ కాలనీలో నివాసం ఉంటోంది. విజయ హత్య విషయం తెలుకుని ఆమె భర్త సుభాష్​రెడ్డి కార్యాలయానికి చేరుకొని మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. అనంతరం అక్కడికి చేరుకున్న విజయారెడ్డి తల్లి వినోద గుండెలు ‘బాదుకుంటూ అమ్మా.. నిన్ను పెద్ద చదువులు చదివించింది ఇందుకేనా..?’ అంటూ రోదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This