రూ.7444 ఇంజెక్షన్‌ @రూ.35 వేలు!

బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు వినియోగించే  ఔషధాలను అనధికారికంగా సేకరించి, నల్లబజారుకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు మెడికల్‌ షాపు నిర్వాహకులు ఉన్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. టాస్‌్కఫోర్స్‌ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వివరాలు వెల్లడించారు. కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన కె.క్రాంతి కుమార్‌ వీవీ నగర్‌లో మెడిక్స్‌ ఫార్మసీ పేరుతో, వివేకానంద నగర్‌కు చెందిన ఎన్‌.వెంకట దినేష్‌ స్థానికంగా శంకరి పార్మసీ పేరుతో మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This