కరోనా పరీక్షల ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం అనుమానం

ప్రైవేటు ల్యాబుల్లో చేస్తున్న కరోనా పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం.. ఓ ల్యాబ్​లో చేసిన పరీక్షల్లో సుమారు 71.7 శాతం మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. సదరు ల్యాబ్​లో 3,726 నమూనాలను పరీక్షించగా 2,672 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది. ప్రైవేటు ల్యాబ్​ ఫలితాలను మరోసారి తెలంగాణ వైద్యారోగ్య శాఖ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో సదరు ల్యాబ్​ చేసిన పరీక్షల ఫలితాలను నిపుణుల కమిటీ పరిశీలించే వరకు ఆ గణాంకాలను పరిగణలోకి తీసుకోబోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This