‘T’ ఆకారంలో ఎల్​జీ నుంచి సరికొత్త ఫోన్​

ఎంతోకాలంగా ఊరిస్తోన్న ఎల్​జీ వింగ్ స్మార్ట్​ఫోన్​ను ఎట్టకేలకు ఈ దిగ్గజ సంస్థ మంగళవారం ఆవిష్కరించింది. దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ఈ 5జీ మొబైల్​ను విడుదల చేసింది ఎల్​జీ.

ఈ ఫోన్​లో ‘T’ ఆకారంలో రెండు తెరలు ఉంటాయి. ప్రైమరీ తెర 6.8 అంగుళాల ఫుల్​ హెచ్​డీ పీ-ఓఎల్​ఈడీ డిస్​ప్లే (20.5.9 యాస్పెక్ట్ రేషియా) ఉంటుంది. ఈ తెరను తిప్పితే 3.9 అంగుళాల జీ-ఓఎల్​ఈడీ డిస్​ప్లే ప్రత్యక్షమవటం ఈ ఫోన్​ ప్రత్యేకత.

రెండు తెరలు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా పనిచేస్తాయి. ప్రైమరీ తెరను ఉపయోగిస్తున్న సమయంలో రెండో స్క్రీన్​లో నోటిఫికేషన్లు చూసుకునే సౌలభ్యం ఉంటుంది.

ఇతర ప్రత్యేకతలు..

  • స్టోరేజీ: 8జీబీ+ 128జీబీ/256జీబీ (2టీబీ ఎక్స్పాండబుల్​)
  • ఆపరేటింగ్ సిస్టమ్​: ఆండ్రాయిడ్​ 10 (క్యూ ఓఎస్​)
  • ప్రాసెసర్: క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్​ 756 జీ (స్నాప్​డ్రాగన్​ X52జీ మోడెమ్​- ఆర్​ఎఫ్ సిస్టం)
  • వెనుక కెమెరా: 64 ఎంపీ + 13 ఎంపీ + 12 ఎంపీ
  • వాటర్​ రెసిస్ట్​: ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్
  • బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్​ (క్విక్​ఛార్జి 4.0 సపోర్ట్​)
  • బరువు: 260గ్రాములు

ఎల్​జీ వింగ్​ మొబైల్ తొలుత దక్షిణ కొరియాలో లాంచ్ చేశారు. ఉత్తర అమెరికా, ఐరోపాలోని కీలక మార్కెట్లలో వచ్చే నెల విడుదల చేయనున్నారు. అయితే, మొబైల్​ ధరపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు ఎల్​జీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This