ఒడుదొడుకుల్లో దేశీయ స్టాక్​మార్కెట్లు

నష్టాల్లోకి జారుకున్న స్టాక్​మార్కెట్లు

స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్​మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 28 పాయింట్లు నష్టపోయి 36 వేల 645 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 10 వేల 796 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లో..

ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్​బీఐ, టాటాస్టీల్, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, భారతీ ఎయిర్​టెల్ రాణిస్తున్నాయి.

ఇన్ఫోసిస్, టీసీఎస్​, యాక్సిస్ బ్యాంకు, మారుతి సుజుకి, బజాజ్ ఫైనాన్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఆసియా మార్కెట్లు

రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండడం… అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఫలితంగా అవి మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

షాంఘై, హాంకాంగ్​ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతుండగా, టోక్యో, సియోల్ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. మరోవైపు వాల్​స్ట్రీట్ నష్టాల్లో ముగిసింది.

ముడిచమురు  

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 0.16 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర43.01 డాలర్లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This