సాక్షులను ప్రభావితం చేస్తున్నారుగా?

సంగం డెయిరీ అక్రమాల కేసులో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు సోమవారం విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది. ఒక రోజు ముందు నోటీసు ఇచ్చి విచారణ కోసం విజయవాడలోని బస్‌ భవన్‌లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిపించింది. సోమవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 8 గంటల పాటు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించనని చెబుతూ బెయిల్‌ పొందిన ధూళిపాళ్ల.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. సంగం డెయిరీ డైరెక్టర్లతో విజయవాడలో ఆయన సమావేశం నిర్వహించడం బెయిల్‌ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఏసీబీ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This