వ్యాపార దిగ్గజం టాటాకు 27 ఏళ్ల కుర్రాడితో స్నేహం!

ఎవరు చెప్పారు మనిషి… జీవితంలో తొందరగా పైకి రాలేడని. ఈ 27 ఏళ్ల ఎంబీఏ పట్టభద్రుడికి అదేమీ కష్టమనిపించలేదు. అమెరికాలోని ప్రఖ్యాత కార్నెల్​ యూనివర్సిటీలో చదివిన శాంతను నాయుడు.. చాలా చిన్న వయసులోనే వ్యక్తిగతంగా పెద్ద విజయం​ సాధించాడు. దేశంలోని అగ్ర వ్యాపారవేత్త, ఫిలాంత్రపిస్ట్​ రతన్​ టాటా కంపెనీలో గౌరవనీయ హోదాలో ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా వ్యాపార దిగ్గజం టాటాకే తన వినూత్న ఆలోచనలతో.. సలహాలిచ్చే స్థాయికి ఎదిగాడు. టాటాలో.. ఎగ్జిక్యూటివ్​ అసిస్టెంట్​గా సేవలందిస్తున్నాడు. వీరిద్దరికి మంచి దోస్తీ ఉంది.

టాటాతో కలిసి పనిచేయడం గురించి శాంతను నాయుడును అడిగితే.. అలాంటి అవకాశాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయని చెబుతాడు.

”ఇదో గొప్ప గౌరవం. రతన్​ టాటాతో కలిసి పనిచేసే అరుదైన అవకాశం.. జీవితంలో ఎప్పుడో ఓసారి మాత్రమే వస్తుంది. ఇది ప్రతి రోజు, ప్రతి క్షణం నాకు పాఠాలు నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.”

– శాంతను నాయుడు

టాటా.. ఓ దిగ్గజం…

రతన్​ టాటా గురించి.. భారత్​లో దాదాపు అందరికీ తెలుసు. దిగ్గజ వ్యాపారి, టాటా సన్స్​ కంపెనీ మాజీ ఛైర్మన్​, ఫిలాంత్రపిస్ట్​ మాత్రమే కాకుండా.. స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎంతో మందికి అండగా నిలుస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్​, పద్మ భూషణ్​ టాటాను వరించాయి.

మరి అంతటి దిగ్గజం టాటాతో కలిసే పనిచేసే అవకాశం శాంతనుకు ఎలా కలిగింది? అంటే… వీధి కుక్కలపై ప్రేమే.. ఇద్దరినీ కలిపిందట.

ఆ శునకాలే కారణం..!

శాంతను 2014లో పుణెలోని టాటా ఎల్​క్సీ కంపెనీలో ఆటోమొబైల్​ డిజైన్​ ఇంజినీర్​గా పనిచేసే సమయంలో.. అక్కడ ఓ సమస్య గుర్తించాడు. రాత్రివేళల్లో.. కార్లు, ఇతర వాహనాల వేగానికి వీధికుక్కలు బలైపోవడం చూసి అతని మనసు చలించిపోయింది. వాహనదారులకు చీకట్లో అవి కనిపించకపోవడమే కారణమని గ్రహించి.. శునకాలకు రాత్రిపూట మెరిసేలా మెడలో కాలర్లను ఏర్పాటుచేశాడు.

ఎన్నో ప్రయత్నాల అనంతరం.. ఈ కాలర్లను రూపొందించడం విజయవంతం అయింది. ఈ ఇనిషియేటివ్​ను ఇప్పుడు మోటోపాస్​గా పిలుస్తున్నారు. ఇదే పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులకు ఈ మోటోపాస్​.. టాటా గ్రూప్​ దృష్టికి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This