’26/11′ ఐకమత్యం భవిష్యత్తులోనూ ఉండాలి: టాటా

26/11 ఉగ్రదాడులకు స్పందనగా ముంబయి చూపించిన ఐకమత్యం, దయ, సున్నితత్వాన్ని భవిష్యత్తులోనూ ప్రదర్శించాలని పిలుపునిచ్చారు దిగ్గజ వ్యాపారవేత్త రతన్​ టాటా. ఉగ్రదాడికి గురువారంతో 12ఏళ్లు నిండిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు టాటా.

“12ఏళ్ల క్రితం జరిగిన ఘటనను ఎప్పటికీ మరచిపోలేము. ప్రాణాలు కోల్పోయిన వారికి ఈరోజున మనం నివాళులర్పిస్తాం. శత్రువులను ఓడించేందుకు కృషిచేసిన ధైర్యవంతుల త్యాగాన్ని గౌరవిస్తాం. అయితే ఆ రోజున.. విభేదాలు పక్కనపెట్టిన ముంబయి వాసులు ముందుకొచ్చి ప్రదర్శించిన ఐకమత్యం, దయ చిరస్మరణీయం.”

— రతన్​ టాటా, టాటా సన్స్​ మాజీ ఛైర్మన్.

మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌​ ఆనంద్​ మహీంద్రా ట్విట్టర్​ వేదికగా 26/11 ఉగ్రదాడులను గుర్తుచేసుకున్నారు. ముంబయి వాసులు ధైర్యాన్ని ప్రదర్శించారన్నారు.

“అనిశ్చితి, అభద్రతా భావం నెలకొన్న ఆ రోజును ముంబయి వాసులు ఎప్పటికీ మరచిపోలేరు. నగరంతో పాటు దేశంపైనా దండయాత్ర జరుగుతున్నట్టు ఆ సమయంలో నాకు అనిపించింది. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని నేర్చుకున్నా. “ధైర్యంగా ఉండటం అంటే భయం లేకపోవడం కాదు.. నిజానికి ధైర్యంగా ఉండటం అంటే భయాన్ని జయించడమే” అన్న నెల్సన్​ మండేలా వ్యాఖ్యలను మనం నిజం చేశాం.”

— ఆనంద్​ మహీంద్రా, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This