అలా చేసుంటే ‘క్రాక్​’ నుంచి తీసేసేవాళ్లు కదా: తమన్

ఉర్రూతలూగించే హుషారైన పాటలకు.. మదిని మైమరపించే మెలోడీ గీతాలకు చిరునామా.. తమన్‌. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో జాతీయ స్థాయిలో సినీ సంగీత ప్రియుల్ని మురిపించిన ఆయన.. ఇప్పుడు దక్షిణాదిలో వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న రవితేజ ‘క్రాక్‌’ సినిమాకు ఆయనే స్వరాలందించారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. ఈనెల 9న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ‘ఈనాడు సినిమా’తో ఆదివారం ప్రత్యేకంగా ఫోన్లో ముచ్చటించారు తమన్‌.

అందరికీ 2020 పీడకల. మీకు మాత్రం ఓ మధుర జ్ఞాపకంగా నిలిచినట్లుంది కదా?

అవునండి. నిజానికి ఈ క్రెడిట్‌ అంతా త్రివిక్రమ్‌, అల్లు అర్జున్‌లదే. వాళ్లు నాకిచ్చిన ఎనర్జీ, వాళ్లు నాపై ఉంచిన నమ్మకం వల్లే ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో గొప్ప విజయం అందుకోగలిగాం. ఆ పాటలకు ఇంతటి ఆదరణ వస్తుందని మేమెవ్వరం ఊహించలేదు. నిజానికి ఇవి ఊహించి చేస్తే వచ్చేవి కాదు. అందరం నిజాయితీగా కష్టపడి పని చేశాం. దానికి తగ్గ ఫలితాన్ని అందుకున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This