బెదిరింపు ఫోన్​ కాల్​తో ‘తాజ్’​ వద్ద భద్రత కట్టుదిట్టం

బెదిరింపు ఫోన్​ కాల్​తో తాజ్​ వద్ద భద్రత కట్టుదిట్టం

ముంబయిలోని తాజ్​హోటల్​, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్​లోని కరాచీ నుంచి సోమవారం బెదిరింపు కాల్​ రావడమే కారణమని తెలుస్తోంది. హోటల్​ను బాంబులతో పేల్చేస్తామని అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఫోన్​ వచ్చినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందిని మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This