‘ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్​ ఉండకపోవచ్చు’

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ.. టీ20 ప్రపంచకప్​ను నిర్వహించడం కష్టమని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ ఎహ్సాన్​ మణి అభిప్రాయపడ్డారు. బయో సెక్యూర్​ విధానంలో ద్వైపాక్షిక సిరీస్​ జరపొచ్చు.. కానీ అనేక జట్లు పాల్గొనే మెగాటోర్నీని జరపడం కష్టమని తెలిపారు.

“మేము చాలా చర్చలు జరిపాం. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ సాధ్యం కాదని అనుకుంటున్నాం. 2021, 23 సంవత్సరాల్లో ప్రపంచకప్​లు జరగాల్సి ఉంది. కాబట్టి ఈ షెడ్యూల్​ను సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది.

ఎహ్సాన్​ మణి, పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​.

“టోర్నీ సమయంలో ఎవరైనా ఆటగాళ్లు అనారోగ్యానికి గురైనా, ప్రమాదం సంభవించినా.. క్రికెట్​ ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందరినీ భయాందోళన చెందేలా చేస్తుంది. అటువంటి సాహసం మేము తీసుకోలేమం” అని తెలిపారు.

సాధారణంగా ఈ టోర్నీ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగాల్సి ఉంది. అయితే, వివిధ దేశాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా నిర్వహణపై సందిగ్ధత నెలకొంది

1 thought on “‘ఈ ఏడాదిలో టీ20 ప్రపంచకప్​ ఉండకపోవచ్చు’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This