సోషల్ మీడియా నుంచి వైదొలగిన సుశాంత్​ సోదరి

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ సోదరి శ్వేతా సింగ్​ కీర్తి సోషల్​మీడియా నుంచి వైదొలిగారు. ముందస్తు ప్రకటన చేయకుండానే ట్విట్టర్​, ఇన్​స్టా ఖాతాలను డియాక్టివేట్​ చేశారు.

సుశాంత్​ మృతి చెందినప్పటినుంచి.. తన తమ్ముడికి న్యాయం చేయాలంటూ సామాజికమాధ్యమాల్లో ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు శ్వేత. కానీ సామాజిక మాధ్యమాల నుంచి ఉన్నట్టుండి ఆమె తప్పుకోవడం నటుడి అభిమానులను షాక్​కు గురి చేసింది. శ్వేత ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం సుశాంత్​ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా డ్రగ్స్​ విషయంలో అరెస్టు అయిన రియా చక్రవర్తి ఇటీవల బెయిల్​పై విడుదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This