సుశాంత్ క్లాస్ట్రోఫోబికా.. ఇది చూడు రియా!

ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్​పుత్​కు క్లాస్ట్రోఫోబియా (పరిమిత ప్రదేశాల్లో భయపడటం) సమస్య ఉందని రియా చక్రవర్తి ఆరోపించింది. ఒకసారి ఫ్లైట్​లో ఉన్నపుడు సుశాంత్ భయపడ్డట్లు తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యల్ని ఖండించింది సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే. అతడికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న అంకిత “ఇది చూస్తే సుశాంత్​కు క్లాస్ట్రోఫోబియా ఉందని అనిపిస్తోందా” అంటూ ప్రశ్నించింది.

ఈ వీడియోలో సుశాంత్ ఫ్లైట్​ నడపడం నేర్చుకుంటూ కనిపిస్తున్నాడు. సుశాంత్​కు సంబంధించిన మరో ట్వీట్​ను రీట్వీట్ చేసింది అంకిత. దీనికి తన 50 కలల్లో మొదటిది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సుశాంత్.అలాగే సుశాంత్​ ఎప్పుడూ సైకియాట్రిస్ట్​ను కలవలేదని స్పష్టం చేసింది అంకిత. తామిద్దరం కలిసున్నపుడు అతడికి అలాంటి సమస్యలేవీ లేవని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This