అంతర్జాతీయ సానుకూలతలతో మార్కెట్లకు లాభాలు

వారాంతంలో లాభాల్లో మార్కెట్లు..

వరుసగా ఆరు రోజులు నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎట్టకేలకు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 256 పాయింట్లు వృద్ధి చెంది 36,809 పాయింట్లకు చేరింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 77 పాయింట్లు బలపడి 10,883 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు బిహార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.

లాభనష్టాల్లో..

టీసీఎస్​, హెచ్​సీఎల్​ టెక్, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే, భారతి ఎయిర్​టెల్​ లాభాల్లో ఉన్నాయి.

టైటాన్​, కొటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు వెనకబడ్డాయి.

వాల్​స్ట్రీట్​ ప్రభావం..

అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగియటం వల్ల ఆసియా మార్కెట్లు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఆసియాలోని ప్రధాన మార్కెట్లు హాంకాంగ్, జపాన్, ధక్షిణ కొరియా లాభాల్లో సాగుతున్నాయి. షాంఘై కాంపొజిట్ నష్టాల్లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This