‘మర్యాద రామన్న’ జోడీ మరోసారి?

హాస్యనటుడిగా తెరపై మెరిసి, ఇటీవల కాలంలో ‘డిస్కోరాజా’, ‘కలర్​ఫొటో’ సినిమాల్లో ప్రతినాయకుడిగానూ మెప్పించారు. అయితే ఇప్పుడు హీరోగా మరోసారి పలకరించేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు వీఎన్​ ఆదిత్య తీస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి ప్రకటన లేకుండానే సెట్స్​పైకి వెళ్లిన ఈ సినిమా.. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

ఇప్పుడు ఈ సినిమాలో సునీల్​కు జోడీగా నటి సలోనిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఇంతకుముందే రాజమౌళి ‘మర్యాద రామన్న’ కోసం కలిసి పనిచేశారు. మళ్లీ ఇన్నాళ్లకు కలిసి నటిస్తుండటం వల్ల అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This