పది విద్యార్థులకు.. కంటెయిన్‌మెంట్‌ బెంగ

పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సిద్ధమవుతున్న దశలో కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలు పెరగడం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉందని అధికారులు గుర్తించారు. విద్యార్థులందరూ ఒకే బస్సులో వెళ్లి రావడం, ఒకే కేంద్రంలో పరీక్ష రాయడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెసిడెన్షియల్‌ విద్యార్థుల దారెటు?

తెలంగాణలోని వివిధ జిల్లాల విద్యార్థులు నగరానికి వలస వచ్చి ప్రైవేటు పాఠశాలలవసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలు తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రైవేటు రెసిడెన్షియల్‌ పాఠశాలలు తెరిచే బాధ్యత ఆయా యాజమాన్యాలదేనని విద్యాశాఖ చెబుతోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో వసతిగృహాలు తెరిచే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోవాలని సంబంధిత యాజమాన్యాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This