ఎస్పీ బాలు కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 6 గంటలకు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. జూమ్‌ వేదికగా జరిగిన ఈ ప్రార్థనల్లో భారతీరాజా, సత్యరాజ్‌, రాఘవేంద్రరావు సహా పలువురు నటులు, గాయకులు పాల్గొన్నారు.

ఇవాళ ఎస్పీబీ ఆరోగ్యంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని, ఎలాంటి పురోభివృద్ధి లేదని తెలిపారు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తాయన్న నమ్మకం ఉందన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This