‘బుట్టబొమ్మ’ పాటను మర్చిపోలేకపోతున్న వార్నర్

‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట, మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం 450 మిలియన్ల మార్క్​ను అధిగమించింది. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్ వార్నర్​.. వెల్​డన్ అల్లు అర్జున్ అని ఇన్​స్టాలో పోస్ట్ పెట్టాడు.

వార్నర్​కు ‘బుట్టబొమ్మ’తో ఏంటి సంబంధం?

లాక్​డౌన్​లో ఆటలన్నీ నిలిచిపోవడం వల్ల క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆ సమయంలో టిక్​టాక్​లు చేస్తూ అభిమానులకు దగ్గరయ్యాడు వార్నర్. ఈ క్రమంలోనే ‘బుట్టబొమ్మ’, ‘మైండ్​బ్లాక్’ లాంటి తెలుగు పాటలకు డ్యాన్స్​ వేసి టాలీవుడ్​ ఫ్యాన్స్​ కూడా చేరువయ్యాడు. ఇటీవల ఐపీఎల్​లో తమ జట్టు ఫైనల్​కు వెళ్తే ‘బుట్టబొమ్మ’​ స్టెప్పు వేస్తానని వార్నర్​ ఓ నెటిజన్​ కామెంట్​కు రిప్లై ఇచ్చాడు. కానీ హైదరాబాద్​ జట్టు క్వాలిఫయర్​-2లో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో వార్నర్​ అభిమానులు నిరాశ చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This