ప్రముఖ నటుడు ‘కిక్’​ శ్యామ్ అరెస్ట్

ప్రముఖ సినీ నటుడు కిక్ శ్యామ్​ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న ఇతడు.. గ్యాంబ్లింగ్​ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటం వల్ల కేసు నమోదు చేశారు.

తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన శ్యామ్.. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 చిత్రాలలో నటించారు. ఎక్కువగా దర్శకుడు సురేంద్రరెడ్డి సినిమాల్లో కనిపించారు. ‘కిక్’ పవర్​ఫుల్ పోలీస్ అధికారి కనిపించి, టాలీవుడ్​లో కిక్ శ్యామ్​గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This