శ్రుతిహాసన్​ ఒంటిపై ఎన్ని టాటులు ఉన్నాయంటే?

“చిన్నతనంలో దొంగతనం చేసి నాన్నకు దొరికిపోయా.. లెక్కలు నాతో ఎప్పుడూ స్నేహంగా లేవు.. నేను అత్యంత చెత్తగా చేసిన చిత్రమదే.. బ్యాట్‌మ్యాన్, అల్దాదీన్‌ చిత్రాల్ని ఇష్టపడతా” అంటూ బోలెడన్ని ఆసక్తికర కబుర్లను పంచుకుంది నటి శ్రుతి హాసన్‌.

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కాసేపు అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, సినీ కెరీర్‌ల గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
  • ఈ లాక్‌డౌన్‌తో నేర్చుకున్న విషయం ఏంటి?

సృష్టిలో ఏ విషయం మన నియంత్రణలో ఉండదు. మీలోని ఉత్తమ నైపుణ్యాల్ని గుర్తించండి. ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో మెలగండి.

  • అందం రహస్యం?

బాగా వర్కవుట్స్‌ చెయ్యడం. నీళ్లు బాగా తాగడం. ఒకరకంగా ఇది నా తల్లిదండ్రుల మంచి జీన్స్‌ నుంచి వచ్చింది.

  • మీ ఒంటిపై మొత్తం ఎన్ని టాటూలు ఉన్నాయి?

మొత్తం ఐదున్నాయి. మెడపై వేయించుకున్న మ్యూజిక్‌ సింబల్‌. వీపుపై వేయించుకున్న నా పేరు. చేతి మణికట్టుపైన గులాబీ పువ్వు. నడుము కింద ఓ డిజైన్‌. కాలి పాదంపైన మరొక పచ్చబొట్టు ఉన్నాయి.

  • మణికట్టుపైన ఉన్నది గులాబీ టాటూ అంటున్నారు. క్యాబేజీలా ఉంది కదా?

అవును నిజమే. అది గులాబీనే కానీ, క్యాబేజీలా కనిపిస్తోంది. అందుకే నేనూ ఇకపై ఇది క్యాబేజీ అనే ఫిక్సవుతున్నా. మీకూ చెబుతున్నా.. ఇది క్యాబేజీ (నవ్వుతూ).

  • ప్రేమ విషయంలో సంథింగ్‌ సంథింగ్‌ అని తెలుస్తోంది?

అలాంటిదేం లేదు. నథింగ్‌.. నథింగ్‌ (నవ్వుతూ).

  • బాగా ఫిట్‌నెస్‌ ఉండే వ్యక్తిని ప్రేమించడానికి ఇష్టపడతారా?

మామూలు ఫిట్‌నెస్‌ ఉన్న వ్యక్తి అయినా పర్లేదు. చక్కటి ఆరోగ్యవంతుడైతే చాలు.

  • ఇప్పటికిప్పుడు మీకు సూపర్‌ పవర్స్‌ వస్తే ఏం చేస్తారు?

ప్రమాదకరమైన ఇలాంటి వైరస్‌లన్నింటినీ అంతమొందిస్తా. అందరికీ సాయం చేస్తా. ప్రతి ఒక్కరినీ వాళ్ల ఇళ్లకు చేరుస్తా.

  • చిన్నప్పుడు చేసిన సరదా దొంగతనం?

చాలా చిన్న వయసులో ఓ క్యాండీస్‌ ప్యాకెట్‌ కొట్టేశా. కానీ, నేను చేసిన పని నాన్న కనిపెట్టేశారు. ఆ షాప్‌ యజమానికి క్యాండీస్‌ ప్యాకెట్‌ తిరిగిచ్చేసి.. క్షమించమని కోరారు. నా పనికి చాలా సిగ్గుపడ్డా. మళ్లీ ఎప్పుడూ అలాంటి పని చెయ్యకూడదని నిర్ణయించుకున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This