‘గబ్బర్​సింగ్’​ నా జీవితాన్నే మార్చేసింది: శ్రుతి

తెలుగు చిత్రాల్లో నటించినందుకు గర్వంగా ఉందని.. ముఖ్యంగా ‘గబ్బర్​సింగ్’​ తన జీవితాన్నే మార్చేసిందని ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్​ తెలిపింది. ఇటీవలే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీ చిత్రాల గురించే ఎక్కువగా ప్రస్తావించిందని.. దక్షిణాది చిత్ర పరిశ్రమను చిన్నచూపు చూసిందని శ్రుతిపై అనేక వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్​ వేదికగా స్పందించిన ఈ భామ.. తాను ఒకటి చెప్తే.. తెలుగు మీడియా మరొలా చేసుకుంటోందని పేర్కొంది.

“జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి తెలుగులో ప్రచురితమైన కథానాల్లో నిజం లేదు. ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. తెలుగు చిత్రాల్లో నటించినందుకు చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్​తో చేసిన ‘గబ్బర్‌సింగ్‌’ నా జీవితాన్ని మార్చింది. తెలుగు సినిమా, దక్షిణాది చిత్ర పరిశ్రమ నా హృదయంలో భాగమైపోయాయి. హిందీ చిత్రాల గురించి చెప్పాను కానీ ఉత్తరాది, దక్షిణాది చిత్రాల వ్యత్యాసం గురించి ప్రస్తావించలేదు. అందరికీ అర్థమైందని భావిస్తున్నా.”

శ్రుతి హాసన్​, సినీ నటి

ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘క్రాక్’​లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో తమిళ నటి వరలక్ష్మి కీలక పాత్రలో కనిపించనుంది. తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This