లిమ్కా బాటిల్స్​తో మెలోడీ.. ఆయన సృష్టే

ఆ వాద్యం హృద్యం. రసికజన నైవేద్యం. గుండెల్లో మార్మోగే సంగీత నాదం. ఆ వాద్యం వింటుంటే.. శ్రోతలు పూనకాలతో ఊగిపోతారు. సర్వం మరిచి స్వర్గసీమలో తేలియాడుతారు. మెస్మరైజ్‌ చేసే ఆ వాద్య రసధునిలో తలారా స్నానిస్తారు. శిశుర్వేత్తి… పశుర్వేత్తి… అన్న ఆర్యోక్తికి అసలు సిసలైన సంగీతానువాదం ఆయన శైలి. ఆయనే ‘డ్రమ్స్‌ శివమణి’. డ్రమ్స్, ఆక్టోబాన్, దర్బుకా, ఉడుకాయి, కంజరలతో పాటు మరికొన్ని సంగీత వాద్యాలను వాయిస్తారు. మంగళవారం(డిసెంబరు 1) ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలు మీ కోసం

ఐపీఎల్‌ ద్వారా గుర్తింపు

2008, 2010 ఐపీఎల్‌‌లో శివమణి డ్రమ్స్‌ వాయించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఈయనకు అనుబంధం ఉంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సారథ్యంలో సంగీత సాధనాలు వాయించినందుకు శివమణికి ఎక్కువ గుర్తింపు లభించింది. ఏఆర్‌ రెహమాన్, శివమణి చిన్ననాటి స్నేహితులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This