షారుక్​ తర్వాతి చిత్రం ఆ స్టార్​ దర్శకుడితో!

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్​ ఖాన్‌ వెండి తెరకు దూరమై దాదాపు రెండేళ్లవుతోంది. షారుక్ తర్వాతి చిత్రంపై బాలీవుడ్‌ వర్గాల్లో ఎన్నెన్నో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఈ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ స్పష్టత ఇవ్వలేదు.

తాజాగా ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీతో కలిసి షారుక్‌ సినిమా చెయ్యబోతున్నాడని వార్తలొస్తున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన ఇమ్మిగ్రేషన్‌ అంశంపై ఓ హాస్య చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు టాక్​. అన్నీ సవ్యంగా జరిగితే ఆగస్టు నెలలో చిత్రీకరణ ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కడుపుబ్బా నవ్విస్తాడు

ఈ చిత్ర నిర్మాణాత్మక కార్యక్రమాలు ఇదివరకే ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి. ఈ సినిమాలో షారుక్ నటించిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తూ, ఎమోషనల్‌గా కూడా ఉంటాయని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్యారెక్టర్‌ కోసమే షారుక్‌ ఖాన్‌ ప్రత్యేకంగా జుట్టు కూడా పెంచుతున్నాడని తెలుస్తోంది.

ఈ చిత్రంతోపాటు ఆర్‌. మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రాకెట్రై’ సినిమాలోనూ కనిపించ నున్నారు షారుక్​. ఇందులో జర్నలిస్టు పాత్రలో నటించనున్నారు. అంతేకాకుండా అయాన్‌ ముఖర్జీ నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This