కోలీవుడ్​ దర్శకుడైన.. పనితనంలో హాలీవుడ్​ రేంజ్​

ఆకాశాన్ని తాకేంత భారీ సెట్స్.. పాత్ర కోసం గుర్తుపట్టలేని రీతిలో నటీనటులకు మేకప్.. కవితాత్మకంగా ఉండే పాటలకు తగ్గట్టుగా సాంకేతికతను జోడించడం… ఇది భారతీయ చిత్రాలను హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కించే తమిళ దర్శక దిగ్గజం శంకర్‌ వర్కింగ్‌ స్టైల్‌. ఒక తమిళ దర్శకుడైనప్పటికీ శంకర్‌ రూపొందించిన సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందాయి, పొందుతున్నాయి. నేడు (ఆగష్టు 17న) దర్శకుడు శంకర్‌ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

వ్యక్తిగతం

తమిళనాడు తంజావూర్‌ జిల్లాలోని కుంభకోణంలో శంకర్‌ జన్మించారు. ముత్తులక్ష్మి, షణ్ముగం ఈయన తల్లిదండ్రులు. సినీపరిశ్రమకు రాకముందు సెంట్రల్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమా పూర్తి చేశారు. ఒకసారి శంకర్‌ తన బృందంతో చేసిన నాటక రంగ ప్రదర్శనలను అనుకోకుండా ప్రముఖ తమిళ డైరెక్టర్‌ ఎస్‌.ఏ.చంద్రశేఖర్‌ చూశారు. వాటికి ఆకర్షితుడైన దర్శకుడు.. శంకర్‌ని స్కీన్ర్‌ రైటర్‌గా పరిచయం చేశారు. నటుడు కావాలనుకున్న శంకర్‌ భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే ఓ ప్రముఖ డైరెక్టర్‌గా మారారు. దర్శకులు ఎస్‌.ఏ.చంద్రశేఖర్, పవిత్రన్‌లకు శంకర్‌ అసిస్టెంట్‌గా పని చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This