రానున్న ఏడాది నాకు ఎక్స్​ట్రార్డినరీ: షాలినీ పాండే

రానున్న ఏడాది తనకు అద్భుతంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది ‘అర్జున్​రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే. 27వ పుట్టినరోజు జరుపుకొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. రణ్​వీర్ సింగ్​ ‘జయేష్ భాయ్ జోర్దార్’ సినిమాతో బాలీవుడ్​ అరంగేట్రం చేయనుంది. షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం.. కచ్చితంగా థియేటర్లలోనే విడుదలవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది షాలిని.

“రానున్న ఏడాది నాకు ఎక్స్​ట్రార్డినరీగా ఉంటుందని అనుకుంటున్నాను. నా సినిమా ‘జయేష్ భాయ్ జోర్దార్’ కచ్చితంగా థియేటర్లలోనే విడులవుతుంది. దానికోసం ఎదురుచూస్తున్నాను. జనజీవనం సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మా సినిమా ప్రజల్ని థియేటర్​కు రప్పిస్తుందని అనుకుంటున్నాను” -షాలినీ పాండే, హీరోయిన్

‘అర్జున్​రెడ్డి’తో వెండితెరకు పరిచయమైన షాలిని.. ఆ తర్వాత తెలుగులో ‘118’, ‘మహానటి’, ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రాల్లో నటించింది. ‘నిశ్శబ్దం’తో త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This