‘రాధే’ షూటింగ్​​లో పాల్గొన్న సల్మాన్​, దిశా పటానీ

బాలీవుడ్​ సూపర్​స్టార్​ సల్మాన్​ఖాన్ నటిస్తున్న ‘రాధే’ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. షూటింగ్​లో పాల్గొన్నట్లు సోషల్​మీడియాలో సల్మాన్ ఓ పోస్ట్​ ద్వారా వెల్లడించాడు. లాక్​డౌన్​ తర్వాత కరోనా నియంత్రణ చర్యలను పాటిస్తూ ‘రాధే’ షూటింగ్​ పునఃప్రారంభించినట్లు ఆ చిత్రనిర్మాణ సంస్థ సల్మాన్​ఖాన్​ ఫిల్మ్స్ తాజాగా​ ఓ మేకింగ్​ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణలో సల్మాన్​తో సహా దిశా పటానీ కూడా పాల్గొంది.

సెట్​లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అందరూ తగిన ఆరోగ్య నియమాలు పాటిస్తున్నారని ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న జాకీ ష్రాఫ్​ వెల్లడించారు. ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. “గతంలో దాదాపు 200 మందితో కలిసి పనిచేసే వాళ్లకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా బాధలో ఉంది” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This