థాయ్​లాండ్ ఓపెన్: సైనా, ప్రణయ్​కు కరోనా పాజిటివ్

థాయ్​లాండ్ ఓపెన్​ ప్రారంభంలోనే భారత్​కు షాక్ తగిలింది. ఆ టోర్నీలో పాల్గోనేందుకు బ్యాంకాక్ వెళ్లిన స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెఎస్ ప్రణయ్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో మరిన్ని టెస్టుల కోసం వీరిద్దరిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈరోజు సైనాతో మ్యాచ్ ఆడాల్సి ఉన్న మలేసియాకు చెందిన కిసోనా సెల్వదురాయ్​కి వాకోవర్ లభించింది. ఫలితంగా ఆమె నేరుగా రెండో రౌండ్​ ఆడనుంది.

సైనా భర్త, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్​ను కూడా ఆస్పత్రికి తరలించారు. కానీ ఇతడి కరోనా ఫలితం ఇంకా తెలియరాలేదు.

ఇంతకుముందు జపాన్​కు చెందిన కెంటో మొమొటా కూడా కరోనా బారినపడ్డాడు. దీంతో థాయ్​లాండ్ టూర్​ నుంచి తప్పుకుంది జపాన్ బృందం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This