‘ఆయన నాకు దర్శకుడి కన్నా ఎక్కువ’

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్​ తేజ్​, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా ‘ఫిదా’. 2017లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తాను ఎన్నో అనుభవాలను పొందానని చెప్పింది సాయిపల్లవి. తన జీవితాన్ని విభిన్న కోణంలో చూసేలా ఇవి ఉపయోగపడ్డాయని తెలిపింది.

“ఆయన నాకు దర్శకుడి కన్నా ఎక్కువ. నా జీవితాన్ని సరైన కోణంలో చూసుకునేలా నన్ను తీర్చిదిద్దారు. క్లిష్టపరిస్థితుల్లో ఎవరిమీద ఆధారపడకుండా ధైర్యంగా ఉండేలా, నా హక్కుల పట్ల స్వేచ్ఛగా ఎలా మాట్లాడాలి వంటి విషయాలను నేర్పించారు. సమాజంలో ఓ మహిళగా ఎలా వ్యవహరించాలో అర్థమయ్యేలా చెప్పారు. లేకపోతే ఇంకా గల్లీలో ఆడుకునే చిన్నపిల్లలా ఉండేదాన్ని. ఏదీ తప్పో, ఓప్పో తెలుసుకునే జ్ఞానాన్ని ఆయన నాకు అందించారు.

-సాయిపల్లవి, హీరోయిన్​

సాయిపల్లవి త్వరలోనే హీరో నాగచైతన్యతో కలిసి ‘లవ్​స్టోరీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించునుంది. ఈ చిత్రానికి కూడా శేఖర కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This