సచిన్​ పైలట్​ మద్దతుదారుల సమావేశం.. వీడియో వైరల్​

రాజస్థాన్​ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తమ బలాన్ని చూపిస్తూ సచిన్​ పైలట్​ నేతృత్వంలోని కాంగ్రెస్​ క్యాంప్​ సోమవారం అర్ధరాత్రి ఓ వీడియోను విడుదల చేసింది. అందులో 16 మంది ఎమ్మెల్యేలు ఒకే దగ్గర కూర్చుని ఉన్నారు. వారంతా హరియాణా మనేసర్​లోని ఓ రిసార్ట్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ నివాసంలో శాసనసభపక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి 122 మంది ఎమ్మెల్యేల్లో 106 మంది హాజరైనట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో విడుదల చేయటం గమనార్హం.

పైలట్​ అధికారిక వాట్సాప్​ గ్రూప్​లో 10 సెకన్ల నిడివిగల వీడియోను సోమవారం అర్ధరాత్రి పోస్ట్​ చేశారు. ఈ వీడియోలో 16 మంది ఎమ్మెల్యేలు వృత్తాకారంలో కూర్చుని ఉన్నారు. కానీ, అందులో పైలట్​ ఉన్నట్లు కనిపించలేదు. మరో ఆరుగురు ఉన్నప్పటికీ వారు ఎవరనేది తెలియదు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేల్లో ఇద్రరాజ్​ గుర్జార్​, ముకేశ్​ భాకర్​, హరీశ్​ మీనాలు కనిపించారు.

ఈ వీడియోను ‘కుటుంబం’ అనే క్యాప్షన్​తో ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు పర్యటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్​. దీనికి సమాధానంగా ‘కాంగ్రెస్​లో విధేయత అంటే అశోక్​ గహ్లోత్​కు బానిసత్వం.. అది మాకు ఆమోదయోగ్యం కాదు’ అని ట్వీట్​ చేశారు ఎమ్మెల్యే ముకేశ్​ భాకర్​.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This