‘ఆర్​ఆర్​ఆర్’​ టీజర్​ విడుదలలో చిన్న మార్పు!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తోన్న ‘ఆర్ఆర్​ఆర్​’ చిత్రంలోని పతాక సన్నివేశ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్రబృందం ఓ ఫొటోనూ సోషల్​మీడియాలో పంచుకుంది. అయితే ఈ సినిమా టీజర్​ గురించి ఎలాంటి అప్​డేట్​ రాకపోవడం వల్ల అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజర్​ను విడుదల చేస్తారని ఇటీవలే కొన్ని ఊహాగానాలు వినిపించాయి. కానీ, ఈ ప్లాన్​లో చిన్న మార్పు జరిగిందని సమాచారం. రిపబ్లిక్​ డే రోజున గ్లింప్స్​ విడుదల చేసి.. ఆ తర్వాత టీజర్​ను విడుదల చేయాలని జక్కన్న నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This