‘ఎప్పుడూ నా అత్యుత్తమ ఆట కోసం ప్రయత్నిస్తా’

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సారథి రోహిత్ శర్మ 85 పరుగులతో సత్తాచాటి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్​ అనంతరం మీడియాతో మాట్లాడుతూ జట్టును గెలిపించడమే ప్రధాన కర్తవ్యమని తెలిపాడు.

“పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అర్థం చేసుకున్నా. కాబట్టి ఎక్కువసేపు క్రీజులో ఉండి బంతిని బలంగా కొట్టాను. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బాగా ఆడాను. ఇలాగే మంచి ముగింపు ఇవ్వాలనుకుంటున్నా. రాజ్‌కోట్‌ పిచ్‌ మంచి ట్రాక్‌ కలిగి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలర్లకు ఇబ్బందిగా మారుతుందని తెలుసు. అందుకే పవర్‌ప్లేని సద్వినియోగం చేసుకున్నాం. తర్వాత అదే జోరును కొనసాగించాం.”
-రోహిత్‌ శర్మ, టీమిండియా సారథి

బౌలర్లు చాహల్, వాషింగ్టన్ సుందర్​ల ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు రోహిత్. వీరిద్దరు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల బంగ్లాను 153 పరుగులకు కట్టడి చేయగలిగామని తెలిపాడు.

“వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌ చక్కగా బౌలింగ్‌ చేశారు. క్లిష్ట సమయాల్లో చాహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఫలితంగా అతడు ఆత్మ విశ్వాసం సాధించాడు. వాషింగ్టన్‌ మాకు కొత్త బౌలర్‌. కానీ అతడి మూడు ఓవర్లు ఆఖర్లో ఉపయోగించుకోవాలనుకున్నా. మేం ఫీల్డింగ్‌లో తప్పులు చేశాం. దానిని అంగీకరించాలి. అయితే, మా దృష్టంతా పనిని పూర్తి చేయడం(విజయం సాధించడం)పైనే ఉంటుంది.”
-రోహిత్ శర్మ, టీమిండియా సారథి

మొదటి టీ20ని బంగ్లా గెలిచి సిరీస్​ను బోణీ కొట్టగా.. రెండో మ్యాచ్​లో విజయం సాధించి సిరీస్​ను సమం చేసింది టీమిండియా. మూడో టీ20 ఆదివారం జరగనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This