పంజాబ్​తో మ్యాచ్​లో రోహిత్ శర్మ రికార్డుల సునామీ!

గురువారం మ్యాచ్​లో కింగ్స్​ ఎలెవన్ పంజాబ్​పై ముంబయి ఇండియన్స్ గెలిచింది. 48 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ సీజన్​లో ముంబయికి ఇది రెండో గెలుపు, పంజాబ్ జట్టుకు మూడో ఓటమి. రోహిత్ శర్మ అర్థ శతకంతో ఆకట్టుకోగా, పొలార్డ్ ధనాధన్ బ్యాటింగ్​తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. ఈ క్రమంలోనే పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.

రైనాతో సమంగా రోహిత్

70 పరుగులు చేసిన రోహిత్.. ఐపీఎల్​లో 38వ హఫ్ సెంచరీ నమోదు చేశాడు. తద్వారా రైనా(38)తో సమంగా నిలిచాడు. రోహిత్, మరో ఆరు ఫోర్లు కొడితే 450 ఫోర్లు సాధించిన వాడిగా నిలుస్తాడు.

కోహ్లీ, రైనా తర్వాత రోహిత్ శర్మ

పంజాబ్​తో మ్యాచ్​లో రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ(5,068) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​లో 5000 పరుగుల క్లబ్​లో చేరిన మూడో క్రికెటర్​గా రికార్డు సృష్టించాడు. ఇతడి కంటే ముందు కోహ్లీ(5,430), రైనా(5,368) ఉన్నారు.

పంజాబ్​పై ‘600’

ఈ మ్యాచ్​తో పంజాబ్​పై 600 పరుగులు చేసిన తొమ్మిదో బ్యాట్స్​మన్​గా రోహిత్ నిలిచాడు. ఇదే జట్టుపై ఆరు అర్థ శతకాలు కూడా సాధించాడు. ప్రస్తుతం 660 పరుగులతో ఉన్నాడు. తర్వాతి స్థానంలో ధోనీ(595) ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This