రోడ్డు లేని పల్లెలకు రాచబాట

రాష్ట్రంలో సంక్షేమంతో పాటే అభివృద్ధీ సమాంతరంగా పరుగులు పెడుతోంది. ఇప్పటి వరకు మంచి రోడ్డు వసతి కూడా లేని వందల గ్రామాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరం 616 గ్రామాలకు కొత్తగా రోడ్డు సదుపాయం కల్పిస్తే.. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్, మే నెలల్లోనే మరో 52 గ్రామాలకు కొత్తగా రోడ్డు అందుబాటులోకి వచ్చింది. గత ఆర్థిక ఏడాదిలో దాదాపు సగం రోజులు లాక్‌డౌన్, తీవ్ర కరోనా భయందోళనలే నెలకొని ఉన్నప్పటికీ.. పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో రూ.648.97 కోట్లతో 1,550.81 కిలోమీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ తారు రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలోనూ ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావమే ఉంది. అయినా ఈ రెండు నెలల్లోనూ 127.28 కోట్ల ఖర్చుతో 266.91 కిలోమీటర్ల పొడవున కొత్తగా గ్రామీణ తారు రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది. గ్రామానికి, మరో గ్రామానికి మధ్య చిన్నపాటి గ్రామీణ లింకు రోడ్లను పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేపడుతుండగా, పెద్ద పెద్ద రహదారులను రోడ్లు, భవనాల శాఖ నిర్మిస్తోంది. ప్రస్తుతం పేర్కొన్నవన్నీ కేవలం పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినవి మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This