రిషబ్ పంత్‌ విరుద్ధం తిరుగుపడ్డ నెటిజన్లు

బంగ్లాదేశ్‌తో ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమికి పరోక్షంగా కారణమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఉతికారేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని బంగ్లాదేశ్‌ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 154/3తో ఛేదించేసింది. అయితే.. మ్యాచ్‌‌లో టీమిండియా గెలిచేందుకు రెండు అవకాశాలు లభించినా.. పేలవంగా వాటిని చేజార్చుకుంది. ఇక రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా గురువారం రాత్రి జరగనుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో శిఖర్ ధావన్ (41: 42 బంతుల్లో 3×4, 1×6) మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. కానీ.. ధావన్‌ని రనౌట్ చేయించడం ద్వారా తొలుత అభిమానులకి కోపం తెప్పించిన రిషబ్ పంత్ (27: 26 బంతుల్లో 3×4).. కీపింగ్‌ సమయంలోనూ తడబడి టీమిండియా విజయావకాశాన్ని దెబ్బతీశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This