‘గణతంత్ర​ పరేడ్​’పై 22 ఎఫ్​ఐఆర్​లు.. భద్రత కట్టుదిట్టం

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం నిర్వహించిన గణతంత్ర పరేడ్​లో హింసాత్మక ఘటనలపై ఇప్పటివరకు 22 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. 153 మంది సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వారిలో ఇద్దరు ఐసీయూలో ఉన్నట్లు చెప్పారు. మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

భద్రత కట్టుదిట్టం..

హింసాత్మక ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​)​ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే.. ఈ అంశంపై​ విచారణ ప్రారంభించిన అధికారులు.. పంజాబ్, హరియాణా గ్యాంగ్‌స్టర్ల కదలికలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నాటి ఉద్రిక్తతల నేపథ్యంలో.. దిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసుల గస్తీ పెంచగా పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపారు. చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో రైతుల చర్యల ఫలితంగా.. అక్కడ భారీగా పోలీసు బలగాలు మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This