రామోజీ ఫిల్మ్​సిటీలో రవితేజ ‘క్రాక్’

మాస్​ మహారాజా రవితేజ, గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న మూడో చిత్రం ‘క్రాక్’​. లాక్​డౌన్​ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్​.. బుధవారం తిరిగి ప్రారంభమైంది. రామోజీ ఫిల్మ్​ సిటీలో చివరి షెడ్యూల్​ జరపనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రత్యేక పోస్టర్​ను విడుదల చేసింది.

త్వరలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఇందులో శ్రుతి హాసన్​ హీరోయిన్​. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వరలక్ష్మీ శరత్​కుమార్​, అలీ, దేవీప్రసాద్​ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్​ సంగీతమందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This