‘డిస్కో రాజా’ వచ్చేస్తున్నాడోచ్.. విడుదల తేదీ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. షూటింగ్ యమస్పీడ్​గా జరుగుతోంది. గురువారం కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. డిసెంబరు తొలి వారంలో టీజర్​, వచ్చే ఏడాది జనవరి 24న సినిమాను తెస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే వచ్చిన లుక్​లు, లిరికల్​ పాట అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో హీరోయిన్లుగా పాయల్ రాజ్​పుత్, నభా నటేశ్ కనిపించనున్నారు. కీలక పాత్రలో సముద్రఖని, బాబీ సింహా ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This