లాక్​డౌన్ అనుభవంపై రష్మిక ఎమోషనల్​ పోస్ట్

లాక్​డౌన్​తో రెండు నెలల నుంచి ఇంట్లోనే ఉన్న హీరోయిన్ రష్మిక.. భావోద్వేగభరిత సందేశాన్ని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. 18 ఏళ్లు వచ్చినప్పటినుంచి తన జీవితం మారథాన్ రేస్​లా పరుగెడుతూనే ఉందని, ఇప్పుడది ఫినిషింగ్ లైన్​ దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తుందని చెప్పింది. త్వరలో ఈ రేస్ మళ్లీ మొదలవుతుందని రాసుకొచ్చింది. తల్లిదండ్రులు, సోదరి.. తనకు అండగా నిలబడిన విషయం గురించి చెప్పుకొచ్చిందీ భామ.

https://www.instagram.com/rashmika_mandanna/?utm_source=ig_embed

“18 ఏళ్ల వయసు నుంచి నా జీవితం మారథాన్ రేసులానే ఉంది. ఇప్పుడు పినిషింగ్ లైన్ దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తోంది. ఇది మళ్లీ త్వరలో ప్రారంభమవుతుంది. అయితే ఈ విషయంపై నేనేం ఫిర్యాదు చేయడం లేదు. ఎందుకంటే గత కొన్నేళ్లలో ఎక్కువ కాలం ఇంట్లో ఉన్నది ఇప్పుడే. పాఠశాల నుంచి ఉన్నత విద్య చదివే వరకు హాస్టల్​లోనే ఉన్నా. దానితో పాటే నా తల్లిదండ్రులు స్ట్రిక్ట్​గా ఉండటం వల్ల టీనేజ్​కు వచ్చేసరికి రెబల్​లా తయారయ్యా. లాక్​డౌన్ వల్ల దాదాపు 2 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నా. ఇదెంతో ప్రత్యేకమైన విషయం. ఈ సమయంలో పనిగురించి ఏం అడగకుండా అమ్మనాన్న.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేలా మానసిక ధైర్యాన్నిచ్చారు. మీరు చాలాకాలం పాటు పనిచేసి, ఇంటికొచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా అనిపిస్తే మీరు నిజంగా అదృష్టవంతులే” -రష్మిక మంధాన, హీరోయిన్

ఈ ఏడాది ప్రారంభంలో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో హిట్​లు కొట్టిన రష్మిక.. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’లో హీరోయిన్​గా నటిస్తోంది. దీనితో పాటే పొగరు(కన్నడ), సుల్తాన్(తమిళం)లోనూ కథానాయికగా కనిపించనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This