హాథ్రస్​ ఘటనపై సిట్ దర్యాప్తు వేగవంతం

ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ ఘటనపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. అత్యాచార బాధితురాలికి చికిత్స చేసిన జవహర్​లాల్​ నెహ్రూ మెడికల్​ కళాశాల, అలీగఢ్ ఆసుపత్రికి వెళ్లారు అధికారులు. వైద్యులను కలిసి సిట్​ బృందం పలు ప్రశ్నలు సంధించింది.

గైనకాలజీ, ఆప్తమాలజీ, ఫోరెన్సిక్​, న్యూరోసర్జరీ విభాగానికి చెందిన సిబ్బందిని ప్రశ్నించింది సిట్. సెప్టెంబర్​ 14న బాధితురాలిని అలీగఢ్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. న్యూరోసర్జరీ విభాగం ఆమె పరిస్థితి విషమంగా ఉందని సెప్టెంబర్ 22న తెలిపింది.

ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఫాస్ట్ ట్రాక్​ కోర్టులో కేసు విచారణ జరుపుతున్నారు. 7 రోజుల్లో సిట్​ దర్పాప్తు నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

నిరాకరణ…

హాథ్రస్​ బాధితురాలి కుటుంబం ఆమె అస్థికలను నీటిలో కలపడానికి నిరాకరించింది. ఆమె మృతదేహన్ని రాత్రికి రాత్రి తగలబెట్టిన విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేసింది.

ఇదీ జరిగింది…

సెప్టెంబర్​ 14న యూపీలో దళిత యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను గొంతుకోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో బాధిత యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని తొలుత యూపీ అలీగఢ్​లోని జవహర్​లాల్​ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్​ జంగ్​ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్టోబర్​ 29న ఆమె మృతి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This