మూడేళ్ల బాలికపై 22 ఏళ్ల యువకుడి అత్యాచారం

బాలికలు, మహిళలపై మృగాళ్ల అకృత్యాలు ఆగటం లేదు. దేశంలో ఏదో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులను సైతం వదలట్లేదు కామాంధులు. ఇలాంటి ఘటనే కర్ణాటక బీదర్​ జిల్లాలో జరిగింది. హునానాబాద్​ తాలుకాలోని ఓ గ్రామంలో మూడేళ్ల బాలికపై.. 22 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కాగా.. శనివారం వారు పనులకు వెళ్లిన క్రమంలో సాయంత్రం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. బాధితురాలి పొరుగింట్లో ఉండే సదరు యువకుడు.. ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టినట్లు చెప్పారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. నిందితుడి కోసం గాలింపు చేపట్టామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This