‘రణ్​వీర్ నటుడు కాకపోతే సెక్సాలజిస్ట్ అయ్యేవాడు’

బాలీవుడ్‌ నటుడు రణ్​వీర్ సింగ్‌ నటుడు కాకపోయి ఉంటే మంచి సెక్సాలజిస్ట్ అయ్యేవాడని నటి భూమి ఫెడ్నేకర్‌ చెప్పింది. నటి నేహా దూఫియా చాట్‌ షో ‘నో ఫిల్టర్‌ నేహా’లో ఈ విషయాన్ని పంచుకుంది.

బాలీవుడ్‌లో సెక్స్ అప్‌చార్‌ డాక్టర్‌ అయ్యే నటుడు ఎవరైనా ఉన్నారని భూమిని ప్రశించగా.. “రణ్​వీర్ సింగ్‌ నటుడు కాకపోయి ఉంటే మంచి సెక్స్ అప్‌చార్‌ డాక్టర్‌ అయ్యే లక్షణాలు ఉన్నాయి. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ లో(కాస్టింగ్‌ డైరక్టర్‌గా ఉన్న షాను శర్మ దగ్గర) ఉన్నపుడు రణ్​వీర్(బ్యాండ్‌ బాజా బరాత్‌)‌ ఆడిషన్‌కు వచ్చారు. అప్పుడే అనుకున్న అతడి శక్తి చాలా అద్భుతమైనది” అని చెప్పింది.

ప్రస్తుతం ‘దుర్గావతి’ చిత్రంలో నటిస్తోంది. అనుష్క ‘భాగమతి’కి రీమేక్‌ ఇది. ఈ ఏడాదిలో మూడు చిత్రాల్లో నటించిందీ భామ. వాటిలో ‘బూత్‌ పార్ట్ వన్‌: ది హంటెడ్‌ షిప్’, ‘డోలీ కిట్టి ఔర్‌ వో ఛమక్తే సితారే’ సినిమాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This