గల్లంతైన రెండో వ్యక్తి మృతదేహం లభ్యం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ లష్కర్​గూడ వద్ద మంగళవారం రాత్రి వాగు ప్రవాహ ఉద్ధృతికి కారుతో సహా వెంకటేశ్​ గౌడ్​, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారిలో బుధవారం మధ్యాహ్నం వెంకటేశ్​ గౌడ్​ మృతదేహం లభ్యం కాగా.. గురువారం ఉదయం రాఘవేంద్ర మృతదేహం దొరికింది.

రాఘవేంద్ర మృతదేహం సాగర్​పంప్ ప్రాంతంలోని వంతెన వద్ద గుర్తించిన పోలీసులు.. వెలికి తీశారు. వెంకటేశ్ గౌడ్​ స్వస్థలం​ కందూరు మండలం బేగంపేట కాగా.. రాఘవేంద్ర కందుకూరు మండలం బాచుపల్లికి చెందిన వ్యక్తి. వీరిద్దరు చెరువుగట్టు బయల్దేరి లష్కర్​ గూడా వద్ద వాగులో గల్లంతయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This