ఏం చేసినా ‘రంభ’కే చెల్లింది.. అందుకే గ్లామర్​క్వీన్​

దేవకన్యలు, అప్సరసలు, రంభ, ఊర్వశి, మేనకలను ఎవరూ చూడలేదు. కానీ సీనియర్​ హీరోయిన్ రంభను చూస్తే మాత్రం వాళ్లు ఇలానే ఉంటారేమోనని అనిపిస్తుంది. అంతటి అందం ఆమె సొంతం. అల్ట్రా మోడరన్​గా కనిపించినా, బికినీ వేసినా, చీర కట్టినా ఈమెకే చెల్లింది. నేడు 44వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమె గురించి ఓ కథనం.

మలయాళ చిత్రంతో

విజయవాడలో పుట్టి పెరిగిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. పాఠశాలలో చదువుతున్నప్పుడే దర్శకుడు హరిహరన్‌ దృష్టిలో పడింది. మలయాళ చిత్రం ‘సర్గమ్‌’తో అరంగేట్రం చేసింది.

‘ఆ ఒక్కటి అడక్కు’

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘ఆ ఒక్కటి అడక్కు’తో టాలీవుడ్​కు పరిచయమైంది. ఆ చిత్రంతోనే ఆమె పేరు రంభగా మారిపోయింది. ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, ‘భైరవద్వీపం’ తదితర చిత్రాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో వెనుదిరిగి చూసుకోలేదు. ‘హలో బ్రదర్‌’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల ప్రియుడు’, ‘అల్లరి ప్రేమికుడు’, ‘అల్లుడా మజాకా’, ‘మాతో పెట్టుకోకు’ తదితర చిత్రాల్లో నటించి అభిమానుల మనసు గెల్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This